Cotton price at a record level: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో.. పత్తికి రికార్డుస్థాయి ధర పలికింది. వ్యవసాయ మార్కెట్ యార్డు చరిత్రలోనే ఇది అధికమని వ్యాపారులు చెబుతున్నారు. నేడు 2,911 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. క్వింటాల్ పత్తికి గరిష్ఠంగా రూ.10,026 రూపాయలు పలకగా.. కనిష్ఠంగా రూ.7,290 లభించింది. ధర భారీగా పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు తగ్గడం వల్ల పత్తికి డిమాండ్ ఏర్పడి.. ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే.. ఆదోని మార్కెట్లోనే అత్యధిక ధరలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: