సినిమా ఫక్కీలో రైతులను మోసగించేందుకు కర్నూలు జిల్లా ఆర్.తలపాడు గ్రామానికి చెందిన వ్యాపారి విద్యాసాగర్ చేసిన కుట్రను పోలీసులు బయటపెట్టారు. రైతుల వద్ద పత్తిని కొని ఇతర ప్రాంతాల్లో విక్రయించే విద్యాసాగర్... ఇటీవల ఓ కుట్రకు ప్లాన్ చేశాడు. రాయచూర్ పత్తిని విక్రయించి ఆ నగదును తన పొలంలో గుంత తీసి పూడ్చిపెట్టాడు.
తన ఇంట్లో బీరువాలో బట్టలు బయటకు తీసి చిందరవందరగా పడవేసి చోరీ జరిగిందని హంగామా సృష్టించాడు. తన ఇంట్లో చోరి జరిగినట్లు నటించిన విద్యాసాగర్ దొంగలు రూ.22 లక్షలు దోచుకెళ్లారని నమ్మబలికాడు. ముందు రూ.22 లక్షలన్న వ్యాపారి.. ఆ తర్వాత మాటమార్చి రూ.11లక్షల 77 వేల రూపాయలని చెప్పాడు. విషయం తెలుసుకున్న కర్నూల్ తాలూకా సీ.ఐ చలపతిరావు వ్యాపారి ఇంటిని పరిశీలించాడు. విద్యాసాగర్ తీరుపై అనుమానంతో పోలీసులు అతన్ని విచారించారు. చివరికి చేసిన తప్పును ఒప్పుకున్న పత్తి వ్యాపారి..పొలంలో దాచిన సొమ్మును బయటకు తీశాడు. అప్పుల ఒత్తిడితోనే ఈ పని చేసినట్లు వ్యాపారి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యాసాగర్ ప2 కేసు చేసి, విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.