కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ను నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని కార్పొరేటర్లకు ఎమ్మెల్యే సూచించారు. కరోనా సమయంలో వైకాపా కార్పొరేటర్ అభ్యర్థులు చేసిన సేవ, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకే ప్రజలు.. ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని కర్నూలు మేయర్ అభ్యర్థి బీవై రామయ్య అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో నగరాన్ని మోడల్ సిటీగా తయారు చేస్తామన్నారు.
ఇదీ చదవండి