కర్నూలు జిల్లా నందికొట్కూరులో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది... విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. పట్టణంలో బ్యాంకు ఉద్యోగికి కరోనా సోకిన కారణంగా... ఆమెతో అంతకుముందు కాంటాక్ట్ అయిన 60 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించారు.
స్థానిక సాయిబాబా పేటలోని ప్రాథమిక పాఠశాలలో వారందరి నుంచి నమూనాలు సేకరించినట్లు వైద్యులు కృష్ణమూర్తి తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మాస్క్ కచ్చితంగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు.
ఇవీ చూడండి: