కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మంగళవారం ఒక్కరోజే 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 93కు చేరింది. ఈ 9 మంది కర్నూలు నగరానికి చెందిన వారే. వీరిలో ఐదుగురు గన్నీగల్లి వీధికి చెందిన వారుకాగా, ముగ్గురు బుధవారపేటకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు నిర్ధరించారు. ఈ ప్రాంతాల్లో.. హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలెవ్వరిని ఇళ్లలో నుంచి బయటికి రానియవద్దని బయటి వ్యక్తులను ఈ ప్రాంతాలకు అనుమతించవద్దని కలెక్టర్ వీరపాండియన్ పోలీసులను ఆదేశించారు. కరోనా చికిత్స పొందుతూ మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ యువకుడు పూర్థిస్థాయిలో కోలుకోవడంతో అతడిని డిశ్చార్జి చేశారు. జిల్లాలో ఇంకా సుమారు 500మందికిపైగా ఫలితాలు రావాల్సి ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: కర్నూలులో 100కు చేరువలో కరోనా కేసులు