కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని.. అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ మోక్షేశ్వరుడు తెలిపారు. పాఠశాలల్లో సరైన నిబంధనలు పాటించకపోవటం వల్ల.. విద్యార్థులకు పాజిటీవ్ వస్తోందని ఆయన అన్నారు. మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం, శానిటైజర్లు తప్పని సరిగా ఉపయోగించాలని సూచించారు.
నంద్యాలలో 22 కొత్త కేసులు..
కర్నూలు జిల్లా నంద్యాలలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం నంద్యాలలో 22 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందరూ విజయవాడలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులని తెలిసింది. ఈ నెల 19న మరో 14 కేసులు వచ్చాయి. దీంతో అధికార యంత్రాంగ అప్రమత్తమైంది.
ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్ ఎదుట హిజ్రాల ఆందోళన