కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఏకంగా 40 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇవాళ మరో 11 మందికి కరోనా సోకినట్టు తేలిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
వీటితో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 343 కు పెరిగింది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 9 మంది మృత్యువాత పడ్డారు. 43 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 291 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: