ETV Bharat / state

ముంచిన వర్షం...మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం - rhythu bharosa kendralu news

భారీ వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచాయి. మొదట్లో పంట బాగా వచ్చినా ఎడతెరపి లేని వర్షాలతో పంట తుడిచి పెట్టుకుపోయింది. దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. గింజల రంగు మారడంతో విపణిలో వ్యాపారులు, దళారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సరకు నాణ్యతగా లేవంటూ రైతు భరోసా కేంద్రాల్లో తిరస్కరిస్తుండటంతో కర్నూలు జిల్లా నందికొట్కూరు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

farmers noting crop details
పంట వివరాలు నమోదు చేసుకుంటున్న రైతులు
author img

By

Published : Nov 2, 2020, 10:05 AM IST

కర్నూలు జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు 1,20,299 కాగా ప్రస్తుతం 1,15,239 ఎకరాల్లో పంట సాగైంది. అధికారులు 1,12,189 ఎకరాలను ఈ క్రాపింగ్‌ విధానంలో నమోదు చేశారు. ఎకరా సాగుకు రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. సాధారణంగా ఒక్కో ఎకరాకు 25 నుంచి అత్యధికంగా 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

అకాల వర్షాలతో:

జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ఎకరాకు 5 నుంచి 18 క్వింటాళ్ల లోపు దిగుబడి వచ్చింది. మరోవైపు ఎండలు లేకపోడంతో కంకులను కోసి గింజలను ఆరబెట్టే పరిస్థితి లేదు. ఫలితంగా గింజలకు ఫంగస్‌ సోకింది. మరికొన్ని గింజలు నల్లగా మారిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇదే అదునుగా వ్యాపారులు, దళారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.1,850 కంటే భారీగా తగ్గించేశారు. ఇలా చాలా ప్రాంతాల్లో రూ.1,100 నుంచి రూ.1,300 ధరకు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.

కొనుగోళ్లు అంతంతమాత్రమే:

జిల్లావ్యాప్తంగా 862 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోళ్లకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా చాలా ప్రాంతాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గింజల (మాయిశ్ఛరైజింగ్‌) తడి శాతం 14 లోపు ఉండేలా నిర్ణయించారు. ఫంగస్‌ వచ్చినా, నల్లగింజలు ఉన్నా దానిని కొనుగోలు చేయొద్దని అధికారుల ఆదేశాలు ఉన్నాయని సిబ్బంది చెబుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకే కేంద్రంలో ప్రతి రోజూ కేవలం 10 మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు సమీపంలోని కేంద్రాలకు దిగుబడులను తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ ఖర్చు రైతులకు భారంగా మారుతోంది.

పెట్టుబడులు భారీగా పెట్టాం

ఈ ఏడాది వేసిన మొక్కజొన్న పంటతో తీవ్రంగా నష్టపోయాం. మొదట బాగా ఉండటంతో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాం. కంకి పట్టే దశలో వర్షం మొదలై ఎడతెరిపి లేకుండా రెండు నెలలపాటు కురిసింది. ఫలితంగా కంకి గిడసబారి ఎదుగుదల లేక నిలిచిపోయింది. గింజలు సన్నగా ఉన్నాయి. ప్రతి ఏడాది కంకికి 14 నుంచి 22 వరుసలు.. మొత్తం 600 గింజలు ఉండేవి. ప్రస్తుతం కంకికి మొత్తం 40 నుంచి 80 గింజలు మాత్రమే ఉన్నాయి.

- కృష్ణవేణి, జూటూరు

ఉన్నతాధికారులకు నివేదిస్తాం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనవరి వరకు మొక్కజొన్నను కొనుగోలు చేస్తాం. ప్రతి కొనుగోలు కేంద్రంలో రోజుకు 10 మంది రైతుల ప్రకారం వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు యాబై మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తాం. ఫంగస్‌ వచ్చినవి.. నాసిరకం వాటిని గుర్తించి మొత్తం ఎన్ని క్వింటాళ్లు ఉన్నాయని లెక్కగట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. - వీరారెడ్డి, ఏడీఏ, నందికొట్కూరు

ఇదీ చదవండి:

శ్రీశైలంలోకి ఒక్క నెలలోనే 636 టీఎంసీలు..ఆ నీరు అలాగే సముద్రంలోకి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.