పెట్రోలు బంకులో మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ కర్నూలు జిల్లా అధోనిలో వినియోగుదారులు ఆందోళన చేశారు. పట్టణానికి చెందిన వ్యక్తి పెట్రోలు కొట్టించేందుకు పెట్రోల్ బంకుకు వెళ్లగా తక్కువ పెట్రోల్ పోశారంటూ.. యజమానితో వాగ్వాదానికి దిగాడు. కొన్ని రోజులుగా ఇదే పెట్రోల్ బంకులో పెట్రోలు కొనుగోలు చేస్తున్నానని చెప్పిన బాధితుడు.. ఈ రోజు తమ అబ్బాయిని 10 లీటర్ల పెట్రోల్ కోసం పంపించినట్లు తెలిపాడు. దీంట్లో 2 లీటర్ల పెట్రోల్ తక్కువ పోశారని ఆవేదన చెందాడు. బంకు యజమానిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశాడు. అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని వినియోగుదారులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...