ETV Bharat / state

వీడియో వైరల్: చలానాలు కట్టు అంటూ.. బండిపై నుంచి దంపతులను కిందకీడ్చిన పోలీసులు - social media viral

Constables Misbehave : పోలీసులు అంటే ప్రజలకు భద్రత భావం. పోలీసుల అంటే శాంతిని కాపాడుతారనే నమ్మకం. అలాంటిదీ ఇద్దరు కానిస్టేబుళ్లు దంపతులతో ప్రవర్తించిన తీరు.. పోలీసులను విమర్శల పాలు చేస్తోంది. వారి నిర్వాకం ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Constables Misbehave
Constables Misbehave
author img

By

Published : Jan 20, 2023, 12:59 PM IST

Constables Misbehave with Couples : ప్రెండ్లీ పోలీసింగ్​ అని పోలీస్​ అధికారులు అంటుంటే.. కొందరి దురుసుతనం వల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తోంది. ప్రజల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా మసలుకొవాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఆచరణలో కొందరు పోలీసుల తీరు మాత్రం ప్రజలతో దురుసుగానే ఉంటోంది.

కర్నూలు జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు దంపతులతో ప్రవర్తించిన తీరు.. పోలీసులు అంటేనే ప్రజలు విసుక్కునేలా ఉంది. ఆదోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ సమీపంలో వాహన చోదకుల నుంచి పెండింగ్​లో ఉన్న ఈ-చలానా వసూళ్లను పోలీసులు చేపట్టారు. ఈ క్రమంలో దంపతులు చాలానాలు వసూలు చేస్తున్న ప్రదేశానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు.

చలానాలను వసూలు చేస్తున్న వారిలో ఓ కానిస్టేబుల్ దంపతుల వాహనాన్ని​ ఆపారు. పెండింగ్​లో ఉన్న చలానాలను, బకాయిలను చెల్లించాలని వారిని అడగగా.. తమ వద్ద డబ్బులు లేవని దంపతులు సమాధానం ఇచ్చారు. దీంతో దంపతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదంతో ఆగ్రహనికి గురైన కానిస్టేబుళ్లు దంపతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.

చాలానా చెల్లించాల్సిందేనంటూ కానిస్టేబుళ్లు వాగ్వాదానికి దిగటంతో పాటు.. వాహనం నడుపుతున్న వ్యక్తిని కానిస్టేబుళ్లు మెడపట్టుకుని లాక్కేళ్లారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

దంపతులతో కానిస్టేబుళ్ల దురుసుతనం

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.