కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. ఎన్నికల అనంతరం మొదటి కౌన్సిల్ సమావేశం.. ఇన్ఛార్జీ కమిషనర్ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుండగా.. ఇతరులను లోపలికి అనుమతిచ్చకపోవటంతో వాగ్వాదం చోటు చేసుకుంది. స్వతంత్ర, భాజపా, తెదేపా అభ్యర్థులు తన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు తిలకించటంపై అధికారులు అభ్యంతరం తెలిపారు.
అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సీట్ల కేటాయింపు విషయంలో.. కౌన్సిలర్ కర్ణాకర్ రాజు కలుగజేసుకొని.. అధ్యక్షుడికి ప్రత్యేక స్థానం కల్పించాలని.. ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడితో సమానంగా కూర్చోరాదన్నారు. దీంతో వైకాపా, తెదేపా కార్యకర్తలతోపాటుగా.. ఉపాధ్యక్షులు, కౌన్సిలర్ మధ్య వ్యక్తిగత దూషణలతో వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక వాసవి కళ్యాణ మండపం పన్ను చెల్లింపు విషయంలో.. మినహాయింపును తెదేపా కౌన్సిలర్లు వ్యతిరేకించారు. దీంతో సభ రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకొని సమస్య సద్దుమణిగేలా ఎస్ఐ గోపాల్ చొరవ చూపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జులపాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు పీఎం అస్లాం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...: నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద భారీ అగ్నిప్రమాదం