వరద దిగ్బంధానికి గురైన మహానంది పుణ్యక్షేత్రాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. వరద నీరు ఏ విధంగా ఆలయంలోకి ప్రవేశించింది... భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాలపై స్థానిక అధికారులకు సూచనలు చేశారు. వర్షం తగ్గుముఖం పట్టిన కారణంగా... మహానంది క్షేత్రానికి రాకపోకలు పునరుద్ధరించారు. ఆలయంలోకి ప్రవేశించిన వరద తగ్గిన పరిస్థితుల్లో... శుభ్రం చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఇదీ చదవండి: