శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్లను, లడ్డు విక్రయ కేంద్రాలు ,పార్కింగ్ ప్రదేశాలు ,అన్నదాన మందిరం, సీసీ కంట్రోల్ రూంలను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తనిఖీ చేశారు. పరిపాలనా భవనంలో జిల్లాలోని వివిధ శాఖలతో పాటు,దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఆయా శాఖలకు అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.
ఇదీచూడండి.వుహాన్‌లో చిక్కుకున్న కూతురు త్వరగా తిరిగి రావాలని యాగం