కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించారు. రాక్ గార్డెన్స్‌లో జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు, గౌరు దంపతులు, టీజీ వెంకటేశ్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై ఆరా తీశారు. జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామనీ.. ఈసారీ గెలుపు మనదేనని చెప్పినట్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వివరించారు.
ఇవీ చదవండి..