ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కర్నూలు జిల్లా అవుకులో పర్యటించనున్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. హెలికాఫ్టర్లో ఇవాళ మధ్యాహ్నం అవుకు చేరుకోనున్న సీఎం... అనంతరం రోడ్డు మార్గం ద్వారా చల్లా రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని... అక్కడి నుంచి అమరావతికి వెళ్తారు. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.
ఇదీ చదవండి