'క్లీన్ ఆంధ్రప్రదేశ్ - క్లీన్ ఆదోని' పేరుతో కర్నూలు జిల్లా ఆదోనిలో కమిషనర్ ఆర్జీవి కృష్ణ రహదారులు, కాలువలు శుభ్రం చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు భీమాస్ కూడలి నుంచి శ్రీనివాస భవన్ వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. పురపాలక అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొని పట్టణ ప్రజలకు స్ఫూర్తి నిచ్చారు. వంద శాతం పారిశుద్ధ్యం, తడి - పొడి చెత్త అమలుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి: తాగునీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో నిరసన