కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కోయిలకొండ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ వేరువేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావటంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి... ఆదివారం గ్రామం విడిచి వెళ్లిపోయారు. దీనితో కోపోద్రిక్తులైన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు... అబ్బాయి కుటుంబంపై దాడి చేశారు. నలుగురిని గాయపరిచారు. రెండు ఇళ్లను ధ్వంసం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి