ETV Bharat / state

కాంగ్రెస్​ వర్సెస్​ బీఆర్​ఎస్.. కార్యకర్తల బాహాబాహీ - ఏపీ ప్రధాన వార్తలు

Clash Between Congress and BRS Parties: తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలోని మార్కండేయ రిజర్వాయర్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎర్ కార్యకర్తలు ఒకిరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న బీఆర్​ఎస్ కార్యకర్తలు అప్పటికే అక్కడకి చేరుకున్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

CONGRESS
CONGRESS
author img

By

Published : Jan 7, 2023, 8:57 PM IST

Clash Between Congress and BRS Parties: తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మమ్మాయిపల్లి శివారులోని మార్కండేయ రిజర్వాయర్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకొని దాడి చేసుకున్నారు. శనివారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ

విషయం తెలుసుకున్న బీఆర్​ఎస్ కార్యకర్తలు అప్పటికే అక్కడకి చేరుకున్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. ప్రాజెక్టును పరిశీలించడానికి వీళ్లేదని నిరసన చేపట్టారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్ధృతంగా మారి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్త వాల్యనాయక్​పై చేయి చేసుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తలకు దారితీసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.