ఆటో డ్రైవర్ నిజాయతీ... అభినందించిన సీఐ - two town police station in kurnool latest news
ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చటమే కాదు.. తన వాహనంలో ఓ మహిళ మరచిపోయిన వస్తువులను పోలీసుల ద్వారా తిరిగి ఆమెకు చేర్చాడు. కర్నూలులో ఆటోడ్రైవర్ నిజాయతీతో వ్యవహరించిన తీరుని పోలీసులు అభినందించారు.

మహిళకు తన వస్తువులు అందిస్తున్న పోలీసు
కర్నూలు మండలం దొడ్డిపాడుకు చెందిన కురువ అయ్యమ్మ కల్లూరులో ఆటో ఎక్కి పాతబస్టాండు షరాఫ్ బజార్ వద్ద దిగారు. ఈ క్రమంలో బంగారు కమ్మలు, రూ.14వేల నగదు, కాళ్లపట్టీలున్న ప్లాస్టిక్ కవరును ఆటోలోనే మరిచిపోయారు. వస్తువులు, డబ్బు లేవని గమనించుకున్న ఆమె.. వెంటనే రెండవ పట్టణ పోలీసు స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయ్యమ్మ... ఆటోలో మరచిపోయిన కవరును అప్పటికే ఆటో డ్రైవర్ సీతారాముడు స్టేషన్ సీఐకి అప్పగించాడు. సదరు మహిళ వస్తువులను ఆమెకు అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన ఆటోడ్రైవర్ని సీఐ పార్థసారథి రెడ్డి అభినందించారు.
ఇదీ చదవండి: కట్టేశామనిపిస్తే.. కొట్టుకుపోయింది..!