ఘనంగా శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి జ్యోతి ఉత్సవాలు - chowdeshwari devi temple at nandikotkur latest news
కర్నూలు జిల్లా నందికొట్కూరులో శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి జ్యోతి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అమ్మవారి జ్యోతితో పాటుగా 61 జ్యోతులను ఏర్పాటు చేశారు. అమ్మవారి భజన పాటలు, చెక్కభజన, మేళతాళాలతో నంది కోళ్ల సేవ నిర్వహించారు. పట్టణంలోని పురవీధుల గుండా తిరుగుతూ ఉత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారి ఆలయం వద్ద అగ్నిగుండ ప్రవేశం చేశారు.
ఘనంగా శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి జ్యోతి ఉత్సవాలు