కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయ్... కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో తుఫాన్ వాహనంలోని మొత్తం 16 మందిలో 15 మంది మృతి చెందారు. విజయ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బీఎస్సీ, బీఈడీ చదివిన విజయ్... రామాపురంలోని ప్రైవేట్ పాఠశాల నిర్వహిస్తున్నాడని బంధువులు చెప్పారు.
ఇవి కూడా చదవండి: