కర్నూలు జిల్లా నంద్యాల్లో ఓ సంస్థ నిర్వహకుడు పలు రకాల పథకాలు పేరు చెప్పి ప్రజల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి వారిని నట్టేటముంచాడు. వివరాలు తెలుసుకున్న నంద్యాల రెండోపట్టణ పోలీసుల నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నడనే సమాచారంతో బాధితులు పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరారు. చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపటంతో భాదితులు వెళ్లి పోయారు.
ఇది చూడండి: చీటింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్