Central Drought Team Visit At Kurnool District : తీవ్ర వర్షాభావం కారణంగా దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లాలో జాతీయ కరవు బృందం పర్యటించింది. పలు మండలాల్లో రైతులు, అధికారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంది. తుగ్గలి మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఇవాళ జాతీయ కరవు బృందం నంద్యాల జిల్లాలో పర్యటించనుంది.
Kurnool District Farmers Migrated With Drought : కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్, రబీ పంటలు నష్టపోవటంతో రైతన్నలు వలసబాట పట్టారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో జిల్లాలోని 24 మండలాల్లో కరవు తీవ్రత అధికంగా ఉందని అధికారులు కేంద్రానికి నివేదిక పంపారు. ప్రభుత్వ నివేదిక ఆధారంగా దుర్భిక్ష పరిస్థితులను అంచనా వేసేందుకు జాతీయ కరవు బృందం కర్నూలులో పర్యటించింది.
న్యాయం చేయండి - కేంద్ర బృందాన్ని కోరిన రైతులు
Central Drought Team Inspected Crops : పత్తికొండ, ఆస్పరి, ఆదోని, దేవనకొండ, కోడుమూరు మండలాల్లో క్షేత్రస్థాయిలో పంటలను జాతీయ కరవు బృందం పరిశీలించింది. నీతి ఆయోగ్ (NITI Aayog) సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అనురాధ బట్నా, జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారి సంతోష్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్ సెక్రెటరీ సంగీత్ కుమార్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద రైతులు, రైతు సంఘాల నాయకులు కరవు బృందాన్ని కలిశారు. తుగ్గలిని కరవు ప్రాంతంగా గుర్తించాలంటూ వినతి పత్రం అందజేశారు.
Drought Zones in Rayalaseema : క్షేత్ర పర్యటన అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ కరవు బృందం తిలకించింది. భవిష్యత్‌లో తీసుకోవలసిన కరవు నివారణ చర్యలపై అధికారులకు సూచనలు చేసింది. జిల్లాలో తృణ ధాన్యాల సాగును ప్రోత్సహించాలని సూచించింది. వర్షాభావ పరిస్థితుల (Rainfall Conditions) వల్ల పత్తి, వేరుశనగ, కంది, టమోటా, ఆముదం, మిరప, ఉల్లి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అదనపు కలెక్టర్ కరవు బృందానికి తెలిపారు.
కేెంద్ర కరవు బృందాన్ని అడ్డుకున్న రైతులు - తడిసిన పంటల ఫొటో ప్రదర్శన
Central Drought Team on Drought Zones : జిల్లాలోని మిగిలిన రెండు మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జాతీయ కరవు బృందం అధికారులు తెలియజేశారు. జిల్లాలో కరవు ధాటికి 2లక్షల 38వేల 230 హెక్టార్లలో పంట నష్టం, మరో 36వేల 855 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వారికి వివరించారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు SDRF (State Disaster Response Fund) కింద 371 కోట్లు, NDRF కింద 205.78 కోట్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.
రైతుల పట్ల శాపంగా మారిన వైసీపీ ప్రభుత్వం - నిర్వహణ లోపమే కరవుకు నిదర్శనం