జాతీయ జెండా పోల్కి బిగించిన సిసి కెమెరా కర్నూలు జిల్లా ఆదోనిలో జాతీయ జెండాకు నిఘా కెమెరాలు అమర్చారు. స్థానిక తహశీల్దార్ ఆవరణలో జెండా స్తంభానికి కెమెరా బిగించడంతో ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులు జాతీయ జెండా పోల్కి కెమెరా బిగించడం చూసి ఆశ్చర్యపోయారు . దేశభక్తి చాటాల్సిన అధికారులే ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి కెమెరాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.ఇది చూడండి: 'హే పోలీస్... దమ్ముంటే నన్ను కాల్చండి'