ETV Bharat / state

ఏపీలో ఆ పార్టీలతో పొత్తుల్లేవ్ :  సునీల్ దేవధర్

author img

By

Published : Oct 17, 2019, 9:15 PM IST

ఏపీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని భాజపా.. రాష్ట్ర బాధ్యుడు సునీల్ దేవధర్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఎవరితోనే ఎటువంటి పొత్తులు లేవని స్పష్టం చేశారు.  దేశప్రయోజనాల కోసమే పలు పార్టీలు ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు పలికాయన్నారు.

ఏపీలో ఆ.. పార్టీలతో పొత్తుల్లేవ్ :  సునీల్ దేవధర్
ఏపీలో ఆ.. పార్టీలతో పొత్తుల్లేవ్ : సునీల్ దేవధర్
ఆంధ్రప్రదేశ్​లో ఏ పార్టీతోనూ పొత్తుగాని, అవగాహన ఉండదని భాజపా స్పష్టం చేసింది. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలులో పర్యటించిన భాజపా ఏపీ ఇన్​ఛార్జి సునీల్ దేవధర్ ఆయన... తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పొత్తు ఉండబోదన్నారు. ఈ విషయం తన వ్యక్తిగతం కాదని, ప్రధాని మోదీ సహా పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన తర్వాతే ఈ విషయం స్పష్టం చేస్తున్నామన్నారు. జనసేన, వైకాపాలతో ఎలాంటి అవగాహన లేదన్నారు. తెదేపా, వైకాపా నుంచి నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరుతున్నట్లు చెప్పారు. దేశప్రయోజనాల కోసం పార్లమెంటులో కొన్ని బిల్లుల ఆమోదం కోసం... తెదేపా, వైకాపాలు మద్దతు తెలిపాయన్నారు. అంతే తప్ప ఆ పార్టీలతో ఎటువంటి పొత్తులలు లేవన్నారు. మహారాష్ట్ర, హరియాణాల్లో భాజపా భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

'2024 ఎన్నికల్లో వైకాపా, భాజపా మధ్యే పోరు'

Intro:ap_knl_111_17_ghandhiji_sankalpa_yathralo_jatheeyakaryadarshi_sunildiyodar_av_ap10131 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక: మహాత్మా గాంధీ ఆశయాలను ఆచరిద్దాం

Body:కర్నూలు జిల్లాలో భాజపా చేపట్టిన మహాత్మా గాంధీ సంకల్ప యాత్ర మూడవ రోజున కోడుమూరు నియోజకవర్గం లో కొనసాగింది. ఆ పార్టీ స్వర్గ బాధ్యుడు ప్రేమ్ కుమార్, నా యకులు కొత్తూరు, పాలకుర్తి మీదుగా కోడుమూరుకు చేరుకున్నారు .భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి, రాజ్యసభ సభ్యుడు టి జి వెంకటేష్ లు యాత్రలో పాల్గొని ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Conclusion:ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లో జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ మాట్లాడారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించాలి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ మిషన్ను తీసుకు వచ్చారని తెలిపారు. తమ ప్రభుత్వం ఇస్తున్న బీమా ను గతంలో చంద్రన్న బీమా గా ప్రస్తుతం వైయస్సార్ బీమా గా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు .ఏ పార్టీతో పొత్తు లేకుండా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లను పెంచాలని తెలిపారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కోడుమూరులో భాజపా కార్యాలయాన్ని వారు ప్రారంభించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.