ETV Bharat / state

ఇద్దరు దొంగలు అరెస్ట్.. 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం - ఇద్దరు బైకు దొంగల అరెస్ట్ న్యూస్

కర్నూలు జిల్లా ఆదోనిలో ద్విచక్రవాహనాలు దొంగతనం చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 4 లక్షల విలువ చేసే.. 10 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

Bike thieves arrested in Adoni, Kurnool district
ఇద్దరు బైకు దొంగల అరెస్ట్...10 ద్విచక్రవాహనాల స్వాధీనం...
author img

By

Published : Jan 25, 2021, 5:58 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో.. రెండు నెలలుగా జరుగుతున్న బైకు దొంగతనాలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. నెట్టేకళ్ళు క్రాస్ వద్ద తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ద్విచక్రవాహనాలను దొంగిలించి.. షెడ్డులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించారు.

వీరి నుంచి రూ. 4 లక్షల విలువ చేసే.. 10 బైకులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. మరో ఇద్దరు అనుమానితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. మోటార్ సైకిల్ పార్కింగ్ చేసేటప్పుడు తాళం వేసి, జీపీఎస్ అమర్చుకోవడం ద్వారా దొంగతనాలను అరికట్టవచ్చని పోలీసులు సూచించారు.

ఇదీ చదవండి:

ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం.. కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.