కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్ యార్డులో.. ప్రజలకు తక్కువ ధరకు అందజేయాలని నిల్వ చేసిన అరటి పండ్లు పాడైపోయాయి. లాక్డౌన్ నేపథ్యంలో కిలో రూ.7.60తో వీటిని అందించాలని భావించారు. ఈనెల 4వ తేదీన 8 టన్నులు, 11వ తేదీన మరో 14 టన్నుల అరటిని మెప్మా కొనుగోలు చేసింది. అధికారుల నిర్లక్ష్యం, పంపిణీలో జాప్యం వల్ల అవి గోదాముకే పరిమితమై.. చివరకు మగ్గి కుళ్లిపోయాయి.
ఇదీ చూడండి: