విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 25వ తేదీన విజయవాడ కృష్ణ లంకకు చెందిన ఒక మహిళ... తన మూడేళ్ల కుమార్తెతో కూలి పని నిమిత్తం రైలు ఎక్కి రాజమహేంద్రవరం వచ్చింది. అక్కడ లక్ష్మణ్ రావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను కూలి పని ఇప్పిస్తానని వారిని అనకాపల్లి తీసుకొచ్చాడు. ఈనెల 27న వీరు తుమ్మపాల వద్ద కూలి పనికి వెళ్లారు. 28వ తేదీన పని దొరకని కారణంగా.. సినిమాకి వెళ్లారు. మధ్యలో చిన్నారికి తినుబండారాలు కొంటానని చెప్పి... బాలికను లక్ష్మణ్ రావు బయటకు తీసుకువచ్చాడు.
ఎంతకీ వీరు రాకపోవడంతో మహిళ బయటకు వచ్చి చూసింది. తన మూడేళ్ళ చిన్నారి ఎక్కడ కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. సీసీ ఫుటేజీలను పరిశీలించి బాలికను లక్ష్మణ్ రావు ఎత్తుకెళ్తున్న దృశ్యాలును పోలీసులు గమనించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. 29వ తేదీ ఉదయం సింహాచలం వద్ద బాలిక ఆచూకీ కనుగొని... నిందితుడిని అదుపులోకి తీసుకొని... కోర్టుకు తరలించారు.
ఇవీ చదవండి...నెల్లూరు వ్యాపారి హత్య కేసు.. మరో నిందితుడి అరెస్టు