కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని దళిత సంఘాలు వైకాపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ బ్యాంక్ ఛైర్మన్ రాజశేఖర్, సునీల్, ఉసేని తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: ఉపాధ్యాయులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్న గ్రామస్థులు