నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న క్రమంలో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం నిట్రవటి గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన జయమ్మ విజయం సాధించారు.
ఆమె ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు.. ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. జయమ్మ వర్గానికి చెందిన వ్యక్తులపై రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్... పలు చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు