ETV Bharat / state

మంత్రి జయరాం స్వగ్రామంలో పోలీసులపై దాడి

పేకాట ఆడేవారిని పట్టుకునేందుకు మఫ్టీలో వెళ్లిన పోలీసులపై దాడి జరిగింది. తాము మంత్రి అనుచరులమంటూ కొందరు వ్యక్తులు పోలీసులను చితకబాదారు. ఈ ఘటన మంత్రి జయరాం స్వగ్రామంలోనే జరిగింది.

minister-gummanur-jayaram-followers-attacked-police

author img

By

Published : Aug 27, 2020, 6:24 PM IST

Updated : Aug 27, 2020, 8:21 PM IST

కార్మిఖశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం అయిన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో ఉద్రిక్తత నెలకొంది. పేకాట రాయుళ్లను పట్టుకునేందుకు మఫ్టీలో వెళ్లిన పోలీసులపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. గుమ్మనూరులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందం గురువారం ఆ గ్రామానికి వెళ్లింది.

పేకాట స్థావరానికి వెళ్లిన వారిపై పేకాట రాయుళ్లు దాడి చేశారు. 'మేము మంత్రి జయరాం అనుచరులం... మమ్మల్నే అరెస్టు చేస్తారా?' అంటూ వారు పోలీసులను చితకబాదారు. ఘటనలో ఎస్సై సమీర్ బాషాకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి 32 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొందరు పేకాటరాయుళ్లు పరారయ్యారు.

పరారీలో ముగ్గురు: ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ

పోలీసులపై దాడి చేసిన వారిలో డ్రైవర్లు మాత్రమే దొరికారని, మిగిలినవారు పారిపోయారని.. ఎస్ఈబీ అదనపు ఎస్పీ గౌతమీసాలి చెప్పారు. పేకాట కోసం ప్రత్యేకంగా టెంట్ వేశారని, శానిటైజర్, బ్లీచింగ్ పౌడర్‌ను టెంట్‌లో గుర్తించామని చెప్పారు. లిక్కర్ టెట్రా ప్యాకెట్లు, పేక ముక్కలు దొరికాయన్నారు. రూ.5,34,000, 35 కార్లు, 6 స్కూటర్లు సీజ్ చేశామని.. 35 మంది నిందితులను గుర్తించామని తెలిపారు. 32 మందిని కస్టడీలోకి తీసుకున్నామన్న ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు చెప్పారు.

Last Updated : Aug 27, 2020, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.