ప్రజల్లో చైతన్యం నింపుతూ ఆడుతూ పాడుతూ ఉత్సహపరిచే తమకు ప్రస్తుతం బతుకుదెరువు లేకుండా పోయిందంటూ కళాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రెండు సంవత్సరాలుగా ఉపాధి లేక కళాకారులు వీధిలో పడ్డామని.. ప్రభుత్వం వెంటనే తమకు ఆదుకోవాలని పాటలు పాడుతూ నిరసన తెలిపారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకున్న ప్రభుత్వం కళాకారులకు కూడా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
cross firing: విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి