కర్నూలు జిల్లా అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు శ్రీకారం చుట్టేందుకు.. ఎగువ అహోబిలం నుంచి జ్వాలా నరసింహ మూర్తి భక్తులు జయజయ ధ్వానాల నడుమ దిగువకు ఈరోజు చేరుకున్నారు. స్వామివార్లకు.. ప్రధానార్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
స్వామి పల్లకిలో ఊరేగుతూ.. భక్తజనానికి దర్శన భాగ్యం కలిగించడానికి 37 గ్రామాల్లో పర్యటిస్తారు. వీటినే పార్వేట ఉత్సవాలుగా శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్నారు. ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహ మూర్తి, దిగువ అహోబిలంలోని ప్రహ్లాద వరదుడు ఒకే పల్లకిలో కొలువై.. శుక్రవారం నుంచి గ్రామాలకు బయలుదేరనున్నారు.
ఇదీ చదవండి: