కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. కర్నూలులో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పొతుంంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. లాక్ డౌన్ విధించి ప్రతి ఇంటికి రూ.7వేల నగదుతో పాటు నిత్యావసర సరుకులు అందజేయాలన్నారు.
ఇదీ చదవండి:
పదవి ఆమెది... పెత్తనం ఆయనది.. ఎమ్మెల్యే అయినా ప్రశ్నించలేరా?