ETV Bharat / state

జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తిన కర్నూలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు 96వ జయంతి వేడుకలను కర్నూలు జిల్లాలో తెదేపా శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు. అన్నగారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ జయంతి వేడుకలు
author img

By

Published : May 28, 2019, 1:42 PM IST

అన్నగారికి పసుపుదళం నివాళి

ఎన్టీఆర్ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తామని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.

నంద్యాలలో పెద్ద ఎత్తున
స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని నంద్యాలలోనూ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాసనగర్​లో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు జాతికి తారకరాముడు అందించిన సేవలను కొనియాడారు.

ఆలూరులో సంబరంగా
ఆలూరులో తెదేపా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ రామ్ భీమ్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు తెలుగుదేశం కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు.

మిఠాయిలు పంచుతూ
కోడుమూరు నియోజకవర్గంలోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెదేపా నాయకులు జరుపుకున్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.

అన్నగారి వేషధారణలో
ఎన్టీఆర్ జయంతి వేడుకను కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్నంగా నిర్వహించారు. అన్నగారి వేషధారణలో తెదేపా శ్రేణులను అలరించారు. నగరంలోని ఎన్టీఆర్ కూడలిలోని తారకరాముని విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు.

Intro:Ap_vja_18_28_RGV_at_ntr_Statue_av_C10
Sai babu_Vijayawada : 9849803586
యాంకర్ : ఎన్టీఆర్ ర్ జయంతి పురస్కరించుకుని సినీ దర్శకుడుక రామ్ గోపాల్ వర్మ విజయవాడ సింగ్ నగర్ పైపుల రోడ్డు లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్రప్రదేశ్లో విడుదలకు ఎన్నికల కమిషన్ అడ్డుచెప్పడంతో ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పడంతో పోలీసులు ఆయన అడ్డుకొని గన్నవరం విమానాశ్రయం పంపించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఎత్తి వేయడంతో ల ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఇదే ప్రాంతాని కి వచ్చి ఎన్టీఆర్ విగ్రహ నికి పూలమాలలు వేసి జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు..

Body:Ap_vja_18_28_RGV_at_ntr_Statue_av_C10

Conclusion:Ap_vja_18_28_RGV_at_ntr_Statue_av_C10

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.