కర్నూలు జిల్లా నంద్యాలలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.జిల్లా కేంద్రంలోనిశ్రీనివాస సెంటర్లో జరిగిన రోడ్ షో కు నడిగడ్డ ప్రాంతానికి చెందిన షిరాజ్ అనే వ్యక్తి వెళ్లాడు. వేలాది మంది ప్రజలు, అభిమానులు రావడంతో జనసమూహంలో ఊపిరాడక షిరాజ్అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దరించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు... ఆ వ్యక్తి వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు భావిస్తున్నారు.