దూసుకుపోతున్న తెలుగు తమ్ముళ్లు
కర్నూలు జిల్లాలో తెదేపా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొడుమూరులో వ్యాపారస్థుల వద్దకు వెళ్లి తమను గెలిపించాలంటూ అభ్యర్థి రామాంజనేయులు ప్రచారం నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి భరత్ ఇంటింటికీ తిరుగుతూ సైకిల్‌కు ఓటెయ్యాలని కోరారు. పాణ్యం అభ్యర్థి గౌరు చరితా రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఆదోనిలో మీనాక్షినాయుడు తరపున ఆయన బావమరిది రంగస్వామి ఓట్లు అభ్యర్థించారు.
వేగం పుంజుకున్న ఫ్యాను ప్రచారం
వైకాపా సైతం ప్రచారంలోవేగం పెంచింది. నందికొట్కూర్ అభ్యర్థి ఆర్థర్ ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఆదోని అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి.