AP High Court Sensational judgment: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్టుధిక్కార కేసులో ఇద్దరు జిల్లా పంచాయితీ అధికారులకు జైలు శిక్ష విధించింది. గతంలో కర్నూలు జిల్లా డీపీఓగా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్ రావుకు న్యాయస్థానం వారం రోజుల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానాను విధించింది. మరో కేసులో చిత్తూరు జిల్లా పంచాయితీ అధికారి దశరధ రామిరెడ్డికి 15 రోజుల జైలు శిక్ష, రూ. 2 వేల రూపాయలు జరిమానా విధించింది. అయితే, తీర్పు అమలును వారం రోజుల పాటు నిలిపివేస్తూ.. అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇచ్చింది.
సింగవరం గ్రామంలో జలవనరుల శాఖ స్థలంలో గ్రామ సచివాలయ నిర్మాణంపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఉన్నప్పటికీ అప్పటి కర్నూలు జిల్లా డీపీఓగా పనిచేసి ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్ రావు.. సర్పంచ్ చెక్ పవర్‌ను సస్పెండ్ చేసి ఈవో ఆర్‌డీ ద్వారా చెల్లింపులు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారించిన న్యాయస్థానం.. సూమోటోగా కోర్టుధిక్కార కేసుగా నమోదు చేసింది. ఈ క్రమంలో నేడు మరోసారి విచారించిన ధర్మాసనం.. ప్రభాకర్ రావుకు న్యాయస్థానం వారం రోజుల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానాను విధించింది.
ఇవీ చదవండి