ETV Bharat / state

AP High court: 'కోర్టు ఆదేశాల అమలులో.. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారు' - ap high court fires on IAS

AP High court
AP High court
author img

By

Published : Aug 9, 2021, 1:47 PM IST

Updated : Aug 9, 2021, 3:05 PM IST

13:38 August 09

పాఠశాల ఆవరణలో భవనాల నిర్మాణంపై దాఖలైన పిటిషన్ మీద హై కోర్టులో విచారణ

పాఠశాల ఆవరణలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నారంటూ హై కోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణకు... నలుగురు ఐఏఎస్​ అధికారులు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలు పాటించలేదని ఆ నలుగురు ఐఏఎస్​లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లాల్లోని పలు పాఠశాల ఆవరణలో భవనాలు కట్టడంపై దాఖలైన పిటిషన్​ మీద హైకోర్టు విచారణ జరిపింది. ఐఏఎస్‌లు ద్వివేది, గిరిజాశంకర్‌, శ్రీలక్ష్మి, విజయ్‌కుమార్‌ విచారణకు హాజరయ్యారు.

పాఠశాల ఆవరణలో భవనాలు కట్టవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాము ఆదేశించినా పట్టించుకోలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారని.. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భవనాల నిర్మాణం నిలిపివేయాలని తాము ఆదేశించినట్లు ఐఏఎస్​ అధికారులు తెలిపారు. తదుపరి విచారణకు నలుగురు ఐఏఎస్‌లు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 30 కు వాయిదా పడింది.

ఇదీ చదవండి:

ఏపీలో పర్యావరణ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించారు: ఎన్టీటీ

Last Updated : Aug 9, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.