ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎండగతామంటున్న విపక్షాలు.. - Kurnool District local news

CPI Ramakrishna sensational comments on CM Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాలకు తెరతీశారని.. విపక్షాలు మండిపడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ ధన బలంతో గెలవాలని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ఇవిగో.. అంటూ, టీడీపీ నేతలు వీడియోలను విడుదల చేశారు.

Ramakrishna
Ramakrishna
author img

By

Published : Mar 10, 2023, 10:57 PM IST

CPI Ramakrishna sensational comments on CM Jagan: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధన బలంతో గెలవాలని చూస్తున్నారని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గపు పాలనకు బుద్ధి చెప్పేందుకు సీపీఐ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏకమైయ్యాయని అన్నారు. ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిలతో కలిసి ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎవ్వరూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదని అధికార పక్షానికి బుద్ది చెప్పేందుకు సీపీఐ, తెలుగుదేశం, జనసేన పార్టీలు చేతులు కలిపాయన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. శాసన మండలిని రద్దు చేయాలని కోరుతూ.. కేంద్రానికి లేఖ పంపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఓ అవగాహనకు వచ్చాయని.. జిల్లాలో ఉన్న నిరుద్యోగులు, టీచర్లు, న్యాయమూర్తులు టీడీపీ తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించారు.

మాజీ మంత్రి, టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. రాజాం క్యాంప్ కార్యాలయంలో మీడియా మాట్లాడిన ఆయన వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన ఉన్న టీడీపీకి మద్దతుదారుడు.. వేపాడ చిరంజీవి రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, గెలిపించాలని ఆయన కోరారు.

గ్రాడ్యుయేట్స్ కాని వారు ఏజెంట్‌గా ఉండరాదని ఎలక్షన్ కమిషన్ చెప్తున్నప్పటికీ.. వైఎస్సార్ పార్టీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్‌ను పెట్టి తద్వారా అరాచకాలను సృష్టించే ప్రయత్నం చేస్తుందని వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్స్ కాని వారు కూడా బోగస్ సర్టిఫికెట్లు పెట్టి వాలంటీర్లు, ఎలక్షన్ ఆఫీసర్స్‌ని పట్టుకొని దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్పించారన్నారు. ఎలక్షన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. టీడీపీ మద్దతుదారునికి ఓటు వేసి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ఓటర్లను కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్ల భాగోతాన్ని తెలుగుదేశం నేతలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారని.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు ఓ వీడియోను విడుదల చేశారు. చికెన్‌ షాప్‌లో కోళ్లకు సైతం 16 పట్టభద్రుల ఓటు హక్కును వాలంటీర్లు కల్పించారంటూ ఆరోపించారు. వాలంటీర్లు నమోదు చేసినా ఆ 16 మంది పట్టభద్రుల ఓట్లరు ఎక్కడున్నారో చూపాలంటూ రామానాయుడు సవాల్‌ విసిరారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.