శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎగువ అహోబిలంలో అంకురార్పణ చేశారు. 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు కాపలాదారుగా ఉన్న విశ్వక్సేనుడు మేళతాళాల మధ్య పుట్ట బంగారు మన్ను మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ పీఠాధిపతి పర్యవేక్షణలో వేద పండితులు మంత్రాలు పఠిస్తూ పవిత్ర మట్టికి పూజలు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరి ఆశీస్సులు ఉండాలని ఉద్దేశంతో అంకురార్పణ కార్యక్రమం చేపట్టడం ఇక్కడ ఆనవాయితీ.
ఇదీ చదవండి :