Anganwadi Workers Protest in AP : సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు హోరెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. నున్నలో అంగన్వాడీ కేంద్రం తాళాలు పగులకొట్టడానికి పంచాయతీ అధికారులు ప్రయత్నించగా స్థానికులు, మహిళలు అడ్డుకున్నారు. మహిళా పోలీసులు వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనుదిరిగారు.
Anganwadi Workers Problems in AP : అంగన్వాడీలపై ఎమ్మెల్యే అప్పాల నర్సయ్య అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ అవనిగడ్డలో మహిళలు ర్యాలీ చేశారు. మొవ్వలో అంగన్వాడీల నిరసనకు విపక్షాలు సంఘీభావం తెలిపాయి. పెనుగంచిప్రోలులో కేంద్రాల తాళాలను పగలకొట్టడానికి వచ్చిన సచివాలయ సిబ్బంది, వీఆర్వో అధికారులపై స్థానికులు ఎదురుతిరిగారు. విజయవాడ నగరంలోని పలు డివిజన్లలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టడానికి వచ్చిన వారిని ప్రజాసంఘాల నేతలు అడ్డుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలకొట్టడాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరి తహశీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.
అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు విఫలం - వేతనాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన సర్కార్
Anganwadi Agitation Statewide : కర్నూలు జిల్లాలోని ఆస్పరి, మంత్రాలయం మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాల తాళాలను అధికారులు పగులకొట్టారు. అంగన్వాడీలు లేకుండా బాలింతలు, గర్భిణీల, పిల్లలకు పౌష్టికాహారం అందించారు. ఎమ్మిగనూరులో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం నేతలు మద్దతు తెలిపారు. కర్నూలులో జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున అఖిల భారత కిసాన్ సభ అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేసింది.
Anganwadi Workers Problems Increase in YSRCP Government : అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టడం వంటి చర్యలను గతంలో చూడలేదని సత్యసాయి జిల్లాలో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో సమ్మెను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సింగనమల, నార్పల కేంద్రాల అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటిలో ధర్నా చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ నేతలు అన్నదానం ఏర్పాటు చేసి మద్దతు ప్రకటించారు.
అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టిన అధికారులు - సమ్మె అణచివేతకు ప్రభుత్వం యత్నం
Anganwadi Staff Situations in AP : అంగన్వాడీ సిబ్బంది కేంద్రాలకు వచ్చే వరకు పిల్లలను పంపమంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నరసాపురంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులకొట్టడంతో సిబ్బంది ఆందోళనకు దిగారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కేంద్రాల తాళాలను పగులకొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేశారు.
CM Jagan Cheating Anganwadi Workers : విశాఖ జిల్లా పద్మనాభం మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీల ధర్నాకు APTF గిరిజన సంఘం మద్దతు తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, ఆముదాలవలస, సారవకోట, శ్రీకాకుళం పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బంది ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు.
హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీల ఆందోళన - మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు