ETV Bharat / state

అంగన్‌వాడీల మ్యాపింగ్‌ పనులు బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగింత - Anganwadi mapping latest news update

కర్నూలు జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల మ్యాపింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. ప్రతి గ్రామంలోని కేంద్రానికి మ్యాపింగ్‌ చేయనున్నారు. ఈ బాధ్యతను జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు డీఈవో అప్పగించారు. ఆ మేరకు రంగంలో దిగిన ఉపాధ్యాయులు జిల్లా వ్యాప్తంగా పనుల్లో నిమగ్నమయ్యారు.

అంగన్​వాడీ కేంద్రాల మ్యాపింగ్ పనులు
అంగన్​వాడీ కేంద్రాల మ్యాపింగ్ పనులు
author img

By

Published : May 18, 2021, 7:06 AM IST

జిల్లాలో ప్రతి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, దానికి సమీపంలోని ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలకు మ్యాపింగ్‌ చేయాలంటూ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు. భవిష్యత్తులో అంగన్‌వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలనే చర్యలో భాగంగానే మ్యాపింగ్‌ ప్రక్రియ తెర పైకి వచ్చిందనే భావన విద్యాశాఖలో వ్యక్తమవుతోంది. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్‌ ఉద్యోగుల చరవాణి నంబర్లను సైతం ఉపాధ్యాయులకు అందించారు.

ఇందులో భాగంగా పలువురు ఉపాధ్యాయులు గ్రామాల్లో మ్యాపింగ్‌ పనులు చేపడుతున్నారు. కొంత మంది క్షేత్ర స్థాయికి వెళ్లి వివరాలు సేకరిస్తుండగా... మరికొందరు చరవాణుల్లో సమాచారం తీసుకుని పనులు చేస్తున్నారు. అంగన్‌వాడీ ఆయాలు, సూపర్‌వైజర్ల నుంచి ఉపాధ్యాయులు జిల్లా వ్యాప్తంగా సమాచారం సేకరిస్తున్నారు. జిల్లాలో 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3,549 అంగన్‌వాడీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,342 సొంత భవనాల్లో కొనసాగుతుండగా అద్దె భవనాల్లో 1,700 నడుస్తుండగా 507 కేంద్రాలు ఇతర భవనాల్లో నడుస్తున్నాయి.

వివరాల సేకరణ ఇలా..

అంగన్‌వాడీ కేంద్రం ప్రభుత్వ స్థలంలో ఉందా?ప్రైవేటు స్థలంలో ఉందా? ప్రభుత్వ స్థలంలో ఉంటే అందులో ఎంత మంది పిల్లలున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎన్ని గదులు ఉన్నాయి? వంట గది ఉందా? వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, సదుపాయాల వివరాలను ఐసీడీఎస్‌ ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించే బాధ్యత ఉపాధ్యాయులదే. తమ పాఠశాలల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందితో ఫోన్‌లో వివరాలను సేకరించి మ్యాపింగ్‌ చేసే పనుల్లో ఉన్నారు.

ఇవీ చూడండి:

ఆదోనిలో కఠినంగా లాక్​డౌన్ అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.