కశ్మీర్‌లోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన గుల్మర్గ్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రీడలలో భాగంగా మంచులో ఆడే రగ్బీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు..కాశ్మీర్ జట్టుతో తలపడనుంది. ఈ క్రీడాకారిణిలు కర్నూలుకు చెందినవారు. సొంత రాష్ట్రమైన కాశ్మీరీయులకు అక్కడి వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో పంజాబ్, రాజస్థాన్, ఒడిశా జట్లు పాల్గొన్నాయి. మొదటిసారి మంచు రగ్బీని ఆడటానికి ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టుకు అవకాశం వచ్చింది. మైనస్ డీగ్రీల ఉష్ణ్రోగ్రతలో ఆడటం కఠినమే అయినా...చివరివరకు ప్రయత్నిస్తామని క్రీడాకారిణిలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం తెలంగాణలో జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ రగ్బీ ఛాంపియన్‌షిప్‌లో బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరపున మూడోస్థానం లభించింది. బాలుర విభాగంలో పదో స్థానం కైవసం చేసుకున్నాం. మాకు ఈ రగ్బీ ఆటంటే ఏంటో తెలియని సమయంలో జాతీయ రగ్బీ కోచ్‌లతో కర్నూలులో బాలికలకు శిక్షణ ఇప్పించాం. అట్టడగున ఉన్న మేం..ఇప్పుడు మెరుగుపడ్డాం. ఇక్కడ రగ్బీ ఆడటం మాకు మంచి అవకాశం.వచ్చే సంవత్సరం గట్టి పోటీని ఇస్తాం
-రామాంజనేయులు , ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసిసోయేషన్ ప్రధాన కార్యదర్శి.
మూడు సంవత్సరాలనుంచి ఈ ఆటను ఆడుతున్నా..కానీ ఇప్పుడు మంచులో రగ్బీ ఆడటం తొలిసారి. ప్రతికూల పరిస్థితులున్నా ..మేము కచ్చితంగా ఆడుతాము. సొంత ప్రాంతమైన కాశ్మీరీయులకు ఈ వాతావరణం అనుకూలమే. అయినా ఆటలో గెలుపోటములు సహజం. నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ.. భవిష్యత్‌లో మరిన్ని మంచు పోటీలలో పాల్గొంటాం..రాబోయే క్రీడాకారులకు ఈ ఆటను ఆడేలా సూచిస్తాం.
-హరితరెడ్డి, క్రీడాకారిణి
ఇదీచూడండి. దుబాయ్‌కు వెళ్దామని రైలెక్కిన బుడతలు!