AMARAVATI FARMERS MEET RAHUL GANDHI : కర్నూలు జిల్లాలో ప్రవేశించిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిశారు. అమరావతినే రాజధానిగా ఉండాలని రాహుల్‌ను కోరారు. అమరావతే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పినట్లు అమరావతి రైతులు తెలిపారు. తమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారని.. న్యాయ సహాయం చేస్తామని చెప్పారని.. వీలైతే పాదయాత్రలో పాల్గొంటానని రాహుల్ చెప్పినట్లు రైతులు తెలిపారు.
అంతకుముందు రాహుల్‌గాంధీని పోలవరం నిర్వాసిత రైతులు కలిశారు. పోలవరం నిర్వాసిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: