Aluru Grama Sarpanch Begging : కర్నూలు జిల్లా ఆలూరు సర్పంచి అరుణాదేవి.. తన మద్దతుదారులతో కలిసి గ్రామంలోని దుకాణాలు తిరిగి భిక్షాటన చేశారు. గ్రామాభివృద్ధికి నిధులు లేవని.. డబ్బులిచ్చి అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు.
పంచాయతీలకు సంబంధించి 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం వల్ల గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని సర్పంచి ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. పంచాయతీ నిధులు విడుదల చేయాలని కోరారు.
ఇదీ చదవండి : కర్నూలులో 'అఖండ' శత దినోత్సవం.. పోటెత్తిన అభిమానులు