ETV Bharat / state

నేడు ప్రారంభం కానున్న పన్నెండేళ్ల పండగ - cm jagan for tungabhadra pushkaralu news

తుంగభద్ర పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. కరోనా ఆంక్షల మధ్యే పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నదీ స్నానాలు రద్దుచేసి... పూజలు, పిండ ప్రధానాలకు మాత్రమే అనుమతినిచ్చింది. కర్నూలులో సీఎం జగన్‌ నేడు పుష్కరాలను ప్రారంభించనున్నారు.

All sets for tungabhadra pushkaralu 2020
నేడు ప్రారంభం కానున్న పన్నెండేళ్ల పండగ
author img

By

Published : Nov 20, 2020, 5:11 AM IST

నేడు ప్రారంభం కానున్న పన్నెండేళ్ల పండగ

తుంగభద్ర పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు... 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. కర్నూలులో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి తుంగభద్ర పుష్కరాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 10 నిమిషాలకు సంకల్‌బాగ్‌ పుష్కర ఘాట్‌కు సీఎం చేరుకుంటారు. ఒంటి గంట 21 నిమిషాలకు బృహస్పతి మకరరాశిలో ప్రవేశించిన వెంటనే... పుష్కరాలను ప్రారంభించనున్నారు. ప్రత్యేక పూజలు, హోమం కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం... తిరుగు పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.

పుష్కరాల కోసం కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో 23 ఘాట్లు ఏర్పాటు చేశారు. రహదారులు, మౌలిక వసతులు కల్పించారు. రెండో దశ కరోనా వ్యాప్తి భయంతో... అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. నదిలో స్నానాలను నిషేధించారు. పిండప్రదానాలు, పూజాది కార్యక్రమాలకు మాత్రమే అనుమతినిచ్చారు. 12 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు.

పుష్కరాల్లో పాల్గొనాలనుకునే భక్తులు... ఈ-స్లాట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జల్లు స్నానాల కోసం ఏర్పాట్లు చేసినా... ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఒక్కో ఘాట్‌లో 15 మంది పురోహితులకు మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేశారు. సంకల్‌ బాగ్‌ పుష్కర ఘాట్‌లో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమం నిర్వహిస్తారు. సాయంత్రం గంగా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తుల కోసం 54 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. 5 వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు.

ఇదీ చదవండీ... శుక్రవారం నుంచే తుంగభద్ర పుష్కరాలు...ఈ- టికెట్ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.