రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు మితిమీరిపోతున్నాయని తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పాత కందుకూరు సమీపంలో భైరవ స్వామి ఆలయాన్ని అఖిలప్రియ సందర్శించారు. ఆలయంలో స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు మితిమీరిపోతున్నాయని.. ప్రజలను కుల మతాలుగా విభజించి లబ్ధి పొందేందుకు ప్రభుత్వం చూస్తోందన్నాని ఆరోపించారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. దాడులకు సంబంధించి నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు అందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు