ETV Bharat / state

టీడీపీ సభ్యత్వ నమోదులో రికార్డ్​ - కార్యకర్తల ఇన్సూరెన్స్​ కోసం ఒప్పందం - INSURANCE FOR ONE CRORE TDP WORKERS

కోటిమంది టీడీపీ కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం - యునైటెడ్ ఇండియాతో పార్టీ తరఫున నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ

Insurance_for_TDP_Activists
INSURANCE FOR ONE CRORE TDP WORKERS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 7:13 PM IST

INSURANCE FOR ONE CRORE TDP WORKERS: మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేశ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు.

5 లక్షల రూపాయల ప్రమాద భీమా: కోటిమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. అగ్రిమెంట్ ప్రకారం 2025 జనవరి 1వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు కోటిమంది కార్యకర్తల బీమా కోసం తొలివిడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే సంవత్సరం సైతం దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది.

టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి సారథిగా యువనేత నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకూ 138 కోట్లు ఖర్చు చేశారు. గత అరాచక ప్రభుత్వంలో పలు కేసులలో ఇరుక్కున్న తెలుగుదేశం పార్టీ కేడర్ కోసం న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న టీడీపీ కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్​ను ఏర్పాటు చేశారు.

మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్​తో పాటు కృష్ణా జిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యనందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కేడర్​ను కుటుంబసభ్యుల మాదిరిగా కంటికి రెప్పలా కాపాడుకునేందుకు నారా లోకేశ్ చేస్తున్న కృషిపై కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిపై నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేందుకు ఇన్స్యూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. కోటిమంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ఫస్ట్​ అని అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం తాను విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు.

టీడీపీ అభిమానులకు గుడ్​న్యూస్ - సభ్యత్వ నమోదు మరో 15 రోజులు పొడిగింపు

కోటికి చేరువలో టీడీపీ సభ్యత్వ నమోదు - పరిటాల గ్రామం పసుపుమయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.