ETV Bharat / state

గిట్టుబాటు ధర లేక బోరుమంటున్న టమోటా రైతులు.. - ఏపీ తాజా

Tomato farmers in Pattikonda market: ఆరుగాలం కష్టించి పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు.. మార్కెట్​కు తరలిస్తే కనీస గిట్టుబాటు ధర కూడ దక్కడం లేదు. దీంతో చేసేది లేక టమోటా రైతులు వాటిని నేలపాలు చేసి ఆవేదన చెందుతూ ఇంటికి వెళుతున్నారు.

Tomato crop
టమోటా పంట
author img

By

Published : Nov 11, 2022, 12:43 PM IST

Agitation of tomato farmers in Pattikonda market: కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించే టమోటా మార్కెట్లో గత వారం రోజులుగా టమోటా ధరలు పూర్తిగా పతనమయ్యాయి. కిలో టమోటా రూ.3 కూడా ధర పలకనందున.. కొనేవారు లేక రైతులు కష్టపడి మార్కెట్​కు తరలించిన పంట ఉత్పత్తులను నేలపై పారబోసి ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్తున్నారు. గత వారం రోజులుగా ఈ ధరలు మరింత పడిపోవడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. రోజు మార్కెట్​కు భారీగా సరుకు తరలివస్తుండడంతో.. కొనేవారు లేక రైతులు వాటిని చూడలేక.. తిరిగి వాటిని తీసుకెళ్లలేక పలువురు రైతులు.. ఇక్కడే పశువులకు పారబోసి వెళ్తున్నారు.

30 కిలోల బాక్స్ రూ.100 లోపే పలుకుతుండడంతో.. కోత కూలీలకు కూడా ఆ డబ్బులు సరిపోవడం లేదంటూ కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గురువారం సాయంత్రం టమోటా మార్కెట్లో మంగళ, బుధవారాల కంటే కొంతమేర ధరలు మెరుగవడంతో వ్యాపారులు 30 కిలోల బాక్సుకు రూ.110 నుంచి రూ.150 వరకు కొనుగోలు చేస్తున్నారు.

రైతులకు ఏటా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్న.. టమోటా పంట సాగు చేస్తూ తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం ధరల స్థిరీకరణ చేపడతామని హామీ ఇచ్చిన ఇంత వరకు అలాంటి చర్యలేవి చేపట్టనందున ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. కనీసం మద్దతు ధర కోసం టమోటా రైతులు మార్కెట్ కమిటీ అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో టమోటా గుజ్జు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పాలకులు కొన్నేళ్లుగా చెబుతున్న ఇప్పటికీ ఆచరణకు నోచుకోకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.